ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొత్త సంవత్సరం ప్రారంభంతోనే ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇక ఆట మొదలైందని, ఎవరినీ వదిలిపెట్టబోనని’’ ఆయన ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, తనపై పలువురు విమర్శలు చేసినప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కొంతమందికి మిసరబుల్ ట్రీట్‌మెంట్ ఉంటుందని చెప్పానని గుర్తు చేశారు. అయితే, తాను రాజకీయ కక్ష తీర్చుకోవడానికల్లా చేయబోనని, తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టబోనని స్పష్టంగా చెప్పారు. ‘‘నాకు వేరే లక్ష్యముంది. నా కేడర్ ఉద్దేశ్యం ఒకటే, నేను చట్టం, న్యాయం ప్రకారం చర్యలు తీసుకుంటాను’’ అని అన్నారు.
ఇక, టీడీపీ నేతలు లేదా అధికారులు ఎవరైనా తప్పు చేస్తే, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ‘‘ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు, ఎప్పుడూ గెలిచేలా పని చేయాలి’’ అని అభిప్రాయపడ్డారు. 2004లో హైదరాబాదును అభివృద్ధి చేసిన విషయం, ప్రజలకు చెప్పలేకపోయానని, ఇప్పుడు వారికి ఈ విషయాలను స్పష్టం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పారు.
ఇటీవల, పార్టీ నేతలు భయపడ్డారని, జగన్ హయాంలో తమ పార్టీ సభ్యులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ‘‘ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుంటూ, ముందుకు వెళ్ళాలి’’ అని టిడిపి శాసనసభ్యులకు చంద్రబాబు సూచించారు. మరిన్ని పథకాలు అమలు చేస్తూ, ప్రజల ఆశలు నెరవేర్చుతాను అని ఆయన తెలిపారు.

