గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమతి అనిత సమర్పణలో, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసి, ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందినట్లు మేకర్స్ ప్రకటించారు. రామ్ చరణ్‌తో శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు ముందు విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులలో అంచనాలను పెంచాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు, ఎస్.యు. వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా పని చేశారు. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.
రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది, దీనికి ఉన్న అంచనాలు భారీగా ఉన్నాయి.

