నూతన సంవత్సరంలో మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జేబిఎస్ నుండి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు, ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’ భాగంగా ఈ మార్గానికి సంబంధించిన డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయాలని మెట్రో అధికారులను సీఎం ఆదేశించారు. ఈ విస్తరణతో శామీర్ పేట్, మేడ్చల్ ప్రాంతాలకు మెట్రో సౌకర్యం అందుబాటులోకి రానుంది.

