కొత్త ఏడాది తొలి రోజే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో పలు ప్రాజెక్టులు, కొత్త పథకాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు అందిస్తున్న రూ.6,000 మొత్తాన్ని రూ.10,000కి పెంచే అంశంపై విస్తృత చర్చ జరుగుతుందని సమాచారం. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మరింత ఆర్థిక సహాయం అందే అవకాశముంది. అలాగే ఇతర పథకాలు, దేశాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. సమావేశం అనంతరం ప్రకటనలు వెలువడే సూచనలున్నాయి.

