డిప్యూటీ సీఎం పవన్, రేవంత్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “రేవంత్ గొప్ప నాయకుడు, కిందిస్థాయి నుంచి ఎదిగాడు. YCP పద్ధతిలో CM రేవంత్ వ్యవహరించలేదు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపును అవకాశం ఇచ్చారు” అని చెప్పారు. అల్లు అర్జున్ విషయంలో, “ముందూ వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రతి హీరో అభిమానులకు అభివాదం చేయాలని కోరుకుంటాడు. ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేశారు. ఇందులో పోలీసులు తీరును తప్పుపట్టను” అని ఆయన మీడియాతో మాట్లాడారు.

