ముషీరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పుస్తకాల జాతర విజయాన్ని ప్రశంసించారు. ఈసారి బుక్ ఫెయిర్ అద్భుతంగా విజయవంతమైందని, అనేక కార్యక్రమాలకు వేదికగా నిలిచిందని తెలిపారు. గతంలో పుస్తకాల లభ్యత కష్టసాధ్యమైందని, అప్పట్లో రామాయణం, మహాభారతం, కాశీ మజిలీ కథలు మాత్రమే దొరికేవని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో అప్పట్లో రెండు మూడు పుస్తక దుకాణాలే ఉండేవని, ఇప్పుడు బుక్ ఫెయిర్‌లో ఉన్న విస్తృత పరిధి ఆలోచనల విప్లవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

