అమెరికాలో హెచ్-1బీ వీసాల అంశంపై రిపబ్లికన్ పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నిపుణులైన విదేశీ ఉద్యోగులను అమెరికాకు రప్పించడంలో హెచ్-1బీ వీసా కీలకమైన పాత్ర పోషిస్తుందని, ఈ ప్రోగ్రామ్‌కు తన మద్దతు ఉన్నట్లు చెప్పారు. అమెరికా బ్యూరోక్రసీలో మార్పుల కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) చీఫ్‌గా ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి ప్రముఖులను నియమించారు. ఈ చర్య ద్వారా నైపుణ్యం ఉన్న వర్కర్లతో , అమెరికాను ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలిపే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
కానీ, రిపబ్లికన్ పార్టీలోని కొన్ని నేతలు ఈ విషయంలో విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిక్కీ హేలీ, తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని తగ్గించగలిగినట్లు చెప్పారు. విదేశీ ఉద్యోగులపై ఆధారపడడం కంటే, అమెరికన్ టాలెంట్‌ను ప్రోత్సహించడం ముఖ్యం అని ఆమె అన్నారు.
అలాగే, బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించడం ద్వారా లక్షలాది భారతీయులు ప్రయోజనాన్ని పొందారు. ఈ వీసాలు ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఈ చర్చలు అమెరికా ఉద్యోగ మార్కెట్‌లో విదేశీ ఉద్యోగుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీలో కొత్త చర్చలు జరుగుతున్నాయి.

