బంగాళాఖాతంలో వచ్చే మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది శ్రీలంకకు దక్షిణ దిశగా కదులుతూ పడమటి బంగాళాఖాతంలోకి వెళ్లనుంది. ఈ ప్రభావంతో జనవరి 1, 2 తేదీల్లో తీర ప్రాంతాలు, ఉత్తర జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. జనవరి 3 నుంచి 8 వరకు కొడైకెనాల్, ఊటీ వంటి ప్రాంతాల్లో దట్టమైన మంచు కప్పే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలు జనవరి 10న ముగుస్తాయని తెలిపారు. జనవరి, ఫిబ్రవరిలో చలిగాలులు, తరచూ జల్లులు కురుస్తాయని వివరించారు. ఇక నగరంలో మోస్తరు వర్షాలు, మేఘావృత ఆకాశం ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.

