హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆత్మీయ మీడియా సమావేశంలో, హైడ్రా సంస్థ ఏర్పడి దాదాపు 5 నెలలు అవ్వడంపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, ఐదు నెలల అనుభవాలతో వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు.
హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉన్నట్లు, ప్రభుత్వం ప్రత్యేక అధికారులు జీహెచ్ఎంసీ చట్టం కింద కేటాయించడాన్ని ఆయన పేర్కొన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించి, 12 చెరువులు, 8 పార్కులను ఆక్రమణ నుండి రక్షించారు. ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం 1095 చెరువుల్లో ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తామని, సాంకేతిక పరిజ్ఞానం మరియు డాటా ఆధారంగా దీనిని పారదర్శకంగా చేయడం తమ బాధ్యత అని తెలిపారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్లతో తీసిన ఫొటోలు కూడా ఈ ప్రక్రియలో ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
హైడ్రాకు 5800 ఫిర్యాదులు అందినట్లు, 27 పురపాలక సంఘాల నుండి అనధికారిక నిర్మాణాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు వివరించారు.
భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్, 2025లో జియో ఫెన్సింగ్ సర్వే, 12 చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం కు పంపించామని చెప్పారు. త్వరలోనే 72 డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులోకి రాబోతున్నాయి.
అనధికారిక నిర్మాణాలపై చర్యలు, అక్రమ వ్యాపార వాణిజ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. 2025 నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

