మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడవడంతో దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఆర్థిక సంస్కరణల విషయంలో తన అద్భుతమైన నాయకత్వంతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూయడం బాధాకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాప సందేశంలో, “డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంతో సాధన చేసారు. ఆయన సేవలు దేశానికి చిరస్థాయిగా నిలుస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థను నూతన దిశగా తీసుకెళ్ళారు. మన్మోహన్ గారి మరణం దేశానికి తీరని లోటు,” అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సమయంలో వారి కుటుంబసభ్యులకు దైర్యం కలిగించాలని ఆకాంక్షించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం, సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం తెలిపారు. భారత రాజకీయాలలో ఆయన మాదిరి నేతలు అరుదని, ఇలాంటి నేతలు ఎప్పటికీ మరువలేనివారని కొనియాడారు.

