నెల్లూరు , 13వ డివిజన్ పరిధిలో గల యనమలవారి దిన్నె RCM చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో మంత్రి నారాయణ పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులకు పంచి పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడే విధంగా చూడాలని ఏసు ప్రభువును కోరుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ గారితో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, మాజీ మునిసిపాల్ చైర్మన్ టి.అనూరాధ, డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

