పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం, కొడకండ్ల మండలం, నర్సింగాపురం గ్రామంలో రెండు కోట్ల 50 లక్షల 80 వేల రూపాయలతో నిర్మించనున్న ఆయకట్ట నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ…. నీటిపారుదల సదుపాయాలు మెరుగుపడితే పంటల దిగుబడులు పెరుగుతాయని రైతుల జీవనోపాధికి ఇదొక పెద్ద మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఆయకట్టు నిర్మాణం ద్వారా రైతుల నీటి సమస్యలు తీరుతాయి అన్నారు.

ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు ఎంఎల్ఏ హాజరు
పాలకుర్తి మండలం, వల్మిడి గ్రామంలో పురాతనమైన శివాలయం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే యశస్వి ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. పాలకుర్తి, బమ్మెర, వల్మీడీ గ్రామాలను కలుపుతూ టూరిజం హబ్ గా మార్చడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో గల చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

