సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి మొత్తం రూ.2 కోట్ల సహాయాన్ని అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఇందులో నటుడు అల్లు అర్జున్ తన తరపున రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ తరపున రూ.50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ తరపున రూ.50 లక్షల రూపాయల మొత్తాన్ని ఎఫ్‌డిఎస్ ఛైర్మన్ దిల్ రాజుకు అందించారని తెలిపారు. రేవతి కుటుంబాన్ని సినీ రంగం ఆదుకుంటుందని చెప్పారు.

