తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి ప్రభుత్వం మద్దతు కీలకమని మా అధ్యక్షులు మంచు విష్ణు అన్నారు. అలాగే ముఖ్యంగా, అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రోత్సాహం సినీ పరిశ్రమకు ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేశారు. ప్రతి ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా “మా” సభ్యులకు వినతి, సున్నితమైన విషయాలపై స్పందించవద్దని, వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోవడం మంచిది కాదని సూచించారు. ఇటీవలి సంఘటనల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని, అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం వస్తుందని. మా సభ్యుల ఐక్యత ప్రస్తుతం అవసరమని మంచు విష్ణు చెప్పారు.

