హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ మరియు రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనంతో ఉత్తరాది జిల్లాల్లో మినహా మిగతా ప్రాంతాలలో చలి తగ్గింది. నిన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండలో వర్షాలు కురిశాయి.

