ప్రతి పథకం ప్రజల అభ్యున్నతి కోసమే
ప్రజల సంక్షేమమే సీఎం రేవంతన్న ధ్యేయం
నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి

ప్రజల సంక్షేమమే మా కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల క్యాంప్ కార్యాలయంలో, రాయపర్తి మండలానికి సంబంధించి రాయపర్తి రైతు వేదికలో, తొర్రూరు పెద్దవంగర మండలాలకు సంబంధించి తొర్రూరు క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు నిరుపేద కుటుంబాల్లో ఒక వరంగా మారిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి ఈ పథకాలు అందేలా కృషి చేయాలని అధికారులు, నాయకులు, కార్యకర్తలను కోరారు. ఇందిరమ్మ పాలనలో ప్రవేశపెడుతున్న ప్రతి పథకం ప్రజల అభ్యున్నతి కోసమే అని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో ప్రతి ఇంటి ఆడబిడ్డకు సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద కొడుకు అవుతున్నారన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, మీకోసం ఎప్పుడు అహర్నిశలు కృషి చేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా తమ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమండ్ల తిరుపతిరెడ్డి, బ్లాక్ అధ్యక్షులు మండల పార్టీల అధ్యక్షులు, ఎంపీడీవోలు ఎం ఆర్ ఓ లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్లు సమాజానికి ఆదర్శం

తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో లయన్స్ క్లబ్ లో పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల డే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పెన్షనర్ల సేవలు మరువలేనివన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వృద్ధుల సంక్షేమానికి అనేక పథకాలు అమలులో ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెన్షనర్లు, నాయకులు తదితరులు. పాల్గొన్నారు.

