జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, రాఘవపురం గ్రామానికి చెందిన పూజారి సతీష్ గౌడ్ రోజు కులవారి వృత్తిలో భాగంగా సాయంత్రం తాడిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్రంగా గాయాలయ్యి పక్క ఎముకలు విరిగి విశ్రాంతి తీసుకుంటున్న బాధితుడిని గౌడ జన హక్కుల పోరాట సమితి ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్బంగా గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం గీత కార్మికులకు తక్షణ సహాయం వెంటనే విడుదల చేసి, పూజారి సతీష్ గౌడ్ లాంటి గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలని, కాటమయ్య రక్షణ కవచం
గీత కార్మికులకు అందరికీ అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని పంపిణీ చేయాలని, వాటితో ఇలాంటి ఘటనలు జరగకుండా వుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి
రాష్ట్ర కార్యదర్శి కమ్మగాని పరమేశ్వర్ గౌడ్, జిల్లా కార్యదర్శి గూడ దామోదర్ గౌడ్, జిల్లా సలహాదారులు
బండి సోమయ్య గౌడ్, బుర్ర కుమార్ గౌడ్, పాలకుర్తి మండల అధ్యక్షుడు పొడిశెట్టి వెంకన్న గౌడ్, మండల కార్యదర్శులు కమ్మగాని యాకయ్య గౌడ్, పులి కొమురెల్లి గౌడ్, పూజారి నారాయణ గౌడ్, పూజారి కుమారస్వామి గౌడ్, పూజారి సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
తాడిచెట్టు పై నుండి పడి తీవ్రంగా గాయపడ్డ గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

