పెద్ద వంగర మండలంలో దేవాదుల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్ట పరిహార నిధుల పంపిణీ


పాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలం, పోచంపల్లి గ్రామంలో దేవాదుల ప్రాజెక్టు కారణంగా భూమి కోల్పోయిన 250 మంది రైతులకు 11 కోట్ల 40 లక్షల నష్టపరిహార నిధులను స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతిలో కీలకమైన దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా భూమి కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వడంతో వారి జీవితాల్లో వెలుగు నింపడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతులను బాగు చేయడమే లక్ష్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మేరీ క్రిస్మస్ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగకు ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఆ యేసు క్రీస్తు ఆశీస్సులు మన అందరిపై వుండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమాలలో తొర్రూరు ఏఎంసీ చైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు, 6 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

