రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల
సంక్రాంతి నుండి రైతు భరోసాను అమలు చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా రైతు భరోసా కోసం ప్రభుత్వం సబ్‌కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. సిఎం రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి వుందన్నారు.

