బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావం కారణంగా చెన్నై నగరంలో ప్యారీస్, అన్నా నగర్, సైదాపేట, మైలాపూర్, వడపళని, కోడంబాక్కం, నుంగంబాక్కం, థౌజండ్‌లైట్ వంటి ప్రాంతాల్లో శుక్రవారం వేకువజామునే తేలికపాటి వర్షాలు మొదలయ్యాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

