తెలంగాణ ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో ఆర్థిక దర్యాప్తు సంస్థ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఏసీబీ (ఆంటీ కార్పొరేట్ బ్రిబరీ) FIR ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద మాజీ మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అప్పటి ఐటీ కార్యదర్శి అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి అనే వ్యక్తులపై ఈడీ కేసు నమోదు చేసింది.
ఈ-కార్ రేసింగ్ నిర్వహణలో అనేక అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, అవినీతిపై పలు ఆరోపణలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా, ఈడీ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది.
ఈ దర్యాప్తు BRS పార్టీకి పెద్ద షాక్ గా మారింది, ముఖ్యంగా కేటీఆర్ పై ఆరోపణలు వస్తుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

