శాసనసభ సమావేశాల్లో ఫార్ములా-ఈ కేసుపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) స్పందించారు. తనపై కేసు నమోదైందని ప్రచారం జరుగుతుండగా, దీనిపై పూర్తి సత్యాన్ని బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
సభలో ప్రసంగించిన కేటీఆర్, “ఇప్పుడే మా సభ్యులు చెబుతున్నారు, నాపై ఏదో కేసు నమోదు చేశారని. ఈ సందర్భంలోనే నేను స్పీకర్ గారిని కోరుతున్నాను. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు నిజాలు చెప్పాలన్న నిబద్ధత ఉంటే, ఈ ఫార్ములా-ఈ రేసు పై జరిగిన అంశాలపై సభలో చర్చకు పెట్టాలని కోరుతున్నాను,” అని అన్నారు.
కేటీఆర్ తన ప్రసంగంలో మరింతగా వివరిస్తూ, “ఈ రేసులో జరిగిన అన్ని అంశాలపైనా చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి thappu చేయనని, నా నడవడికకు ఎప్పుడూ మచ్చ తగలదని నమ్మకంగా చెబుతున్నాను. ప్రభుత్వం ఏం చేసినా అది పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాను,” అని ప్రకటించారు.https://youtu.be/DL2fhHFMQ6Y
ఈ వ్యాఖ్యలు శాసనసభలో చర్చకు ముదురుతుండగా, ప్రతిపక్ష పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్ ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తును కోరుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.

