యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత నూనె ఎక్కువ పోస్తే గంత కమ్మగుంటదనుకుంటాండ్రి. ఇగ గది తింటాంటే రత్తంల, శెత్తల కొవ్వుపెరబట్టె. ఇగ గట్ల కూరల్ల ఎక్కువైన నూనె తీసే కిట్కు కూడా ఓకాయినె కనిపెట్టిండుల్లా.
కొడ కొసకు గుండ్రంగ కప్పలెక్క ఉండే గంటెను అతికిపిచ్చిండు. గదానికి రెండు రంద్రాలు శేసిండు. ఇగ గదాన్ని కూరల పైన పేరుకునే నూనెల పెట్టి, మెల్లగ గా రంద్రాలల్లకు నూనె పట్టిండు. గదాన్ని వేరే గిన్నెల పోసిండు. గంతే. వంటకైతే వాడినం గనీ, గా నూనెను తినకుండా ఉండాల్నంటె, గీ శిట్కా మంచిగుంది కదా? మీరూ ఉపాయం శేయిండ్రి.

