ఇగో ఉపాయం ఉన్నోడు ఊల్లేలతడట! ఉపాయం లేనోడో ఊకనే ఉంటడు. గట్లనే గీ అక్క మస్తు ఉపాయం శేశింది. మాయ శేసి, మసి పూసింది. ఎట్లంటరా? మీరే చూడుండ్లి.
బంగారం పెట్టుకోవాల్నని, నగల్ని ఒంటినిండా యేసుకోవాల్నని ఎవరికుండది? గట్లనే గీ అక్కకు పగడాలు పొదిగిన నక్లెస్ యేసుకోవాల్ననిపించింది. బంగారం పిరమాయె. గీ రోజుల్ల పేద బక్కోల్లతోటి అయితాది. గిదీనికి గా అక్క ఓ ఉపాయాన్ని ఆలోశించింది. మందు గోలీల కవర్లను తీసుకున్నది. గదానికి ఎత్తుగ ఉండే దిక్కున ఎర్రటి గోర్ల పెయింటేసింది. గవాట్ని దేనిదానికి ముక్కలు శేసింది. ఫెవికాల్ పెట్టి గదాని సుట్టూత రాల్లు అద్దింది. ఒక ఒకదానికొక్కటి గొలుసు లెక్క లంకెలు పెట్టింది. గదాన్ని మెడకు దగ్గరికని యేసుకున్నది. ఇగ గదాన్ని సూత్తాంటే డైమండ్ల నక్లెసు లెక్కనే కొడతాంది. శతకోటి దరిద్రాలకి, అనంత కోటి ఉపాయాలంటే గిదే కదా?!

