గొర్రెలను మనుసులతోని పోలుస్తరు. గొర్రెదాటు మనుసులంటరు. అంటే గొర్రెల్లెక్కనే మనుసలన్నట్లు. కనీ, గొర్రెల్ని మనుసులే కాస్తరు. గా గొర్రెలు ఒక దానెనుక ఒకటిపోతయి. ఒక గొర్రె బాయిలపడితే అన్ని గొర్రెలు బాయల్నే పడ్తయట. మరి గసొంటి గొర్రెల్ని సక్కగ కాసి, అంతకటే సక్కగ మేతకు, ఇంటికి తీసుకపోయేటందుకు ఓ గొర్ల కాపరి మంచి ఉపాయం కనిపెట్టిండు.
ఇగ గా గొర్రెలు పోవుట్ల సక్కగా పోవు గదా. రోడ్డుకి అటు ఇటు పోతయి. గవాట్ని ఎగేయాల్నంటే మాటలా? ఎంత కట్టమైతది. ఇగ గీ కట్టం లేకుండ గా గొల్లాయనె మస్త్ సోచాయించి ఓ ఇకమతు సేసిండు. గదెందంటే ఓ సిన్న ట్రక్కు బండి తీసుకున్నడు. గా దానికి ఎనుక కట్టెలతోని పందిరి లెక్క తయారు జేసిండు. మూడు దిక్కుల జాలి కట్టిండు. గది గుంజుకపోవడానికి అల్కగ ఉండేందుకు గా పందిరికి ఓ నాలుగు దిక్కుల శెక్రాలు పెట్టిండు. గ దాంట్ల గా గొర్రెలను తోలిండు. ఇగ మెల్లెగ గా బండిని తోల్కపోతాంటే. గా గొర్రెలు ఎనుక పందిరి కింద దబాదబా నడ్సుకుంట పోతానయి. గట్లనే గా గొర్రెలను మేతకు, మంద కాడికి, ఇంటికి తీసుకపోయి, తీస్కొస్తాండు. ఇగ గవాటిని సూసుకొనికే మనిషి కూడా అవసరంలేదుల్ల. మంచిగుంది గద. గొర్రెలను, మేకలను పెంచేటోల్లు గిట్ల శేసి సూడుండ్లి.
…

