ఇగ గీ రోజుల్ల ప్రిజ్ లేని ఇల్లు ఉన్నాదుల్లా!? గా ప్రిజ్జు లేకపోతే ఎట్లెల్లుతది? ఎల్లుతాది! గా నీల్లు, కూరగాల్నుంచి, కరాబైతయి అనుకున్న యన్నీ గండ్లనే ఉండాల్నాయె. ఇగ కొందరైతే పెద్ద పెద్ద ప్రిజ్జులు కొని ఉప్పుకారం కానుంచి నిల్వ పచ్చల్ల దాక గదాంట్లనే పెడ్తరు. ఎందుకంటే గయి కరాబు కావద్దని, తాజగ ఉంటయనే గదా? గనీ, గా ప్రిజ్జుల గీ నాల్గు వస్తువులు అస్సలే పెట్టొద్దట.
ఉల్లి జేసిన మేలు తల్లి గూడ జేయదంటరు గద, మరి గా ఉల్లిని అస్సలే ప్రిజ్జుల పెట్టొద్దట. గట్లనే షియ్య బువ్వ, షియ్య కూరలకు కమ్మగుండాల్నని తాజ తాజ అల్లం ఎల్లిపాయల్ని ఏస్తంగద. గవి గూడ గా ప్రిజ్జుల పెట్టొద్దట. గంతేగాదుల్ల పెయ్యికి మంచిదని కీర దోసలు తెచ్చి, మంచిగ ప్రిజ్జుల్ల పేరుస్తరు, రోజుకు కొన్ని తింటం. గవి గూడ గా ప్రిజ్జుల పెట్టొద్దట. ఎందుకంటే. సల్లంగ కరాబు కాకుంట ఉంటదని పెడ్తె, గవాట్ల విషపూరిత క్రిములు జేరుతయట. ఇగ గవి మన పెయిలకు పోయి బొచ్చెడు రోగాలను తెస్తయట. సమజైతాందా? జెర గియి గూడ పాటించుండ్లి. పెయిని పయిలంగ జూసుకోండి.
గియి ప్రిజ్జుల బెడ్తె.. ఏమైతదో తెలుసా!?|ADUGU TRENDS

