దేశం చిన్నదా పెద్దదా కాదు
అవినీతి ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం
నేడు ఆ’దేశం’
రేపు?
ఏదైనా కావొచ్చు
నీతికి నిలబడుతే
నిలుస్తారు మనుషులు
ఇంకా పదవులు, ప్రభుత్వాలు
లేదంటే చూస్తున్నాం
తప్పించుకోడానికి కూడా
వీలులేని స్థితి, పరిస్ధితి
న్యాయం చెప్పే దేవతకే
నిప్పెట్టిన వైనం
చీమే కదా అని చులకనగా చూస్తే
ఆ చీమలే కదా సర్పానికి
నిలువ నీడ లేకుండా చేసి నలిపేసిన స్థితి
నేడు వారు
మరి రేపు?
మీరే కావచ్చు
ఆలోచించుకోండి
నాయకులారా
ఏదీ శాశ్వతం కాదు
ప్రజల గుండెల్లో పేరే శాశ్వతం
డబ్బు ఓ జబ్బుగా మారింది
ఆస్తులు ఓ ఆలంబనగా మారాయి
జాగ్రత్త సుమా
మరో నేపాలీ రాజకీయ నాయకులుగా
మారొద్దనీ
‘మీ చరిత్ర పేజీలు’ మీరే చింపుకోవద్దని
కోరుకుంటూ…
మీ చరిత్ర పేజీలు..|POETRY


