
అరె..! గిదేంది? గీ ‘అడుగు’ డిజిటల్ మీడియా ఓర్డింగు, గంత పెద్దగ పెట్టిండ్లు! యాడ పెట్టిండ్లో గని మంచిగున్నది గద? ఓర్నీ…! గీ సాయి సందేస్ పొటువని గాడ పెట్టిండ్లు? ఓరయ్యో, గీయిన యిగ్రహాన్ని ఆడ చెక్కింస్తాండ్లా ఏంది? అని ఆలోచిస్తాండ్లు గదా!? యే, గిదంతా ఒట్టిదే. కావాలంటే, అమెరిక స్టాచ్యు ఆఫ్ లిబర్టీ బొమ్మను తీసి మీ బొమ్మ గూడ పెట్టుకోవచ్చు. గీడ కూసొని, గా ఫ్రాన్సుల ఈఫిల్ టవర్ గూడ ఎక్కినట్లు దించుకోవచ్చు. ఇంకా… గా ఏనుగునెక్కినట్టు, గీ పులి మీద సవ్వారీ సేసినట్లు, ట్రంపును కలిసినట్లు, మోదీ సేతుల సేయి యేసినట్లు, యిస్టమైన ఈరోయీన్ తో తైతక్కలాడినట్లు, ఒక్కటేంది? నక్కను తొక్కినట్లు, కుక్కను కొట్టినట్లు యిస్టమొచ్చిన తీర్గ సేసుకోవచ్చు. గిదంతా గా కంపూటర్ మయిమ అన్నమాట. మెదడుకు మేతో, కుత్రిమ మేదో… ఏదో అంటాండ్లు గద. యే గదేనుల్ల… ఎఐ… ఆర్టిఫిసియల్ ఇంటలీజెన్సుతో సేసిన కత గిది. ఉన్నదుట్లు, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, ఉన్నదీ లేనిది కలగలిపి సూపిత్తది. గిది గా జెమిని యాప్ ల వత్తాందట. ఎట్ల కావాలంటే అట్ల సూపిత్తాందట. కావాలంటే మీరూ సురువు చేయిండ్లి. ఇగ ఎట్లుంటదో సూడుండ్లి.

