నాగర్ కర్నూల్ జిల్లా, PEDDA KOTHAPALLI|పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోనీ TELANGANA GRAMEENA VIKAS BANK|తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన ఎం డి, హానీప్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో తన కుడి కాలు కి దెబ్బ తగిలి ఎముక విరిగింది. వైద్య చికిత్స కోసం రూ.లక్షలతో వ్యయం కానున్నది. చికిత్స కోసం నిరుపేద అయిన తన మిత్రుడు హానీప్ కు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నాడని గ్రహించిన స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ ఆదివారం ఇంటికి వెళ్లి బాధితుడుని వారి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ ఖర్చుల కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. అలాగే 1995 SSC|ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ దండు చంద్రయ్య , సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ బాల మల్లయ్య, సొసైటీ రాముడు ,గడ్డిగోపుల ఎల్లయ్య, శ్రీ మిత్ర ఫోటో స్టూడియో రాజులు ప్రమర్శించిన వారిలో ఉన్నారు. బాధితుడి విషయాన్ని తాను మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి డాక్టర్స్ తో మాట్లాడించి మెరుగైన చికిత్స కోసం ఎల్ ఓ సీ ద్వారా ఉచితంగా చికిత్స అందించడానికి కృషి చేస్తామని ,బాధితుడు అనీఫ్ కు ధైర్యం చెప్పి అన్ని విధాల ఆదుకుంటామని బాధితుడైన తన మిత్రుడికి ధండు నర్సింహా భరోసా ఇచ్చారు.

