బిఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల పార్టీకి అవమాన పరిచే చర్యల్లో పాల్గొనడం, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే కారణమని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమభారత్ కుమార్, టీ.రవీందర్ రావు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కవిత పార్టీ శ్రేణుల్లో కలకలం రేపిన ఈ పరిణామం బిఆర్ఎస్ లో రాజకీయ చర్చలకు దారితీసింది. పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఈ నిర్ణయం కీలకమవనుంది.


