చట్ట సభల్లో వార్!?
మాటల యుద్ధం!!
కయ్యానికి CONGRESS|కాంగ్రెస్ సిద్ధం
దండెత్తనున్న BRS|గులాబీ గళం
కథన రంగంలోకి BJP|కమలదళం
మూమెంట్ ను బట్టి AIMIM|ఎంఐఎం
అస్త్రశస్త్రాలతో అధికార పక్షం
కత్తులు నూరుతున్న విపక్షాలు
ఆరు గ్యారెంటీలే వాటి అస్త్రాలు
రాష్ట్రం దివాళే అభివ్రుద్ధికి ఆటంకం
బీసీలకు 24శాతం రిజర్వేషన్ల బిల్లు, జీవో
సెప్టెంబర్ రెండో వారంలోనే స్థానిక నోటిఫికేషన్
కాళేశ్వరం అవినీతిపై కమిషన్ నివేదిక బహిర్గతం
ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక భారాలే GOVERNMENT|సర్కార్ కు శస్త్రాలు
వాడివేడిగా ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు
ఓవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశ పెట్టొద్దని హై కోర్టులో భంగపడ్డ మామా అల్లుళ్ళు కేసీఆర్, హరీశ్ రావులు, తాజాగా మధ్యంతర దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అసెంబ్లీలో చర్చించినా సరే, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు ఆ నివేదికనే సస్పెండ్ చేయాలని వారు కోరారు. మరోవైపు ఈ రోజే అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి, చర్చించేందుకు సర్కార్ సంసిద్ధమైంది. ఇదే కాకుండా, అధికార పక్షం, ప్రతిపక్షంపై మరిన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది. బీసీలకు 24శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చించి, ఆ వెంటనే జీవోను తేనుంది. సెప్టెంబర్ రెండో వారంలోనే స్థానిక నోటిఫికేషన్ వెలువడేలా చకచకా పావులు కదుపుతోంది. ఇంకా.. ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక భారాలు వంటి, శస్త్రాలను సంధించడానికి సిద్ధం చేసుకుంది. ప్రతిపక్షాలని పూర్తిగా కట్టడి చేయడానికి ప్రత్యేకంగా తమ డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన సెలెక్టెడ్ టీమ్ కు తగిన తర్ఫీదు ఇచ్చి, తయారు చేసుకుంది. అయితే, ప్రతిపక్షం రాష్ట్రంతో సంబంధంలేని యూరియాను, అరిగిపోయిన రికార్డుగా మారిన ఆరు గ్యారెంటీలను, ప్రకృతి వైపరీత్యమైన వర్షాలను అస్త్రాలను చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తమ ఉనికిని చాటుకోవడానికి బీజేపీ రెఢీ అంటున్నా, యూరియా సరఫరా, బీసీ బిల్లు వంటి అంశాలు ఆ పార్టీకి ముగుతాడు వేస్తున్నాయి. ఎంఐఎం సందర్భాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో సిద్ధంగానే ఉంది. అసెంబ్లీ సమరానికి సై అంటున్నపార్టీలతో సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి. కాగా, కాలం కలిసొచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 30 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సీన్ రివర్స్ అయింది. సిన్మా అసాధారణంగా ప్రతిపక్షానికి కనిపిస్తోంది. ఆడ లేక ఓడే అధికార పార్టీ, ఆడించే స్థానానికి చేరింది. తెలంగాణలో నేటి నుండి జరుగనున్న ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఒక విచిత్ర పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలంటే అధికార పార్టీకి ఎక్కడో బెరుకు, వెన్నులో వణుకు ఉంటాయి. కానీ ఈసారి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్సాహంగా ఉరుకలు వేస్తోంది. సభకైనా, సవాళ్ళకైనా, సమరానికైనా సై అంటున్నది.
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బయటి చలిని మరిపించే, వాడి వేడిగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రతిపక్షమే డిఫెన్స్ లో ఉంది. అధికార పక్షం అఫెన్స్ లో ఉంది. మిగతా పార్టీలు అసలు ఈ ఆట ఆడాలో తెలియని ఆయోమయంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంది.
అందుకు తగ్గ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుని అన్నింటికీ సంసిద్ధంగా ఉంది. కానీ, ప్రతిపక్షం మాత్రం ఈ సారి సభకు భయపడుతున్నట్లుగా ఉంది. బెరుకుగా, వణుకుగా కనిపిస్తోంది. మాటల్లో ఉండే వాడి, వేడి మెల్లగా కొరవడుతోంది. కాళేశ్వరం అవినీతిపై వేసిన కమిషన్ నివేదిక ఆపార్టీకి ఆశనిపాతంగా, భీతావహంగా మారింది. అందుకే మామా అల్లుళ్ళ కోర్టుల గుమ్మాలను ఎక్కుతూ, మొక్కుతూ ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వంటివేవోవో వారు వదలించుకున్నా, విదిలించుకున్నా, వారిని వదిలేలా లేవు. వదిలించేలా సీఎం లేరు. కోర్టులు, నిబంధనలు, సభా నియమాలు, చివరకు కాలం కూడా వారికి కలిసి వచ్చేలా లేవు. బీఆర్ఎస్ ను అధికార పార్టీ అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ ప్రజా కోర్టు బోనులో దోషిగా నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
మరోవైపు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై త్వరలోనే వెలువడనున్న నోటిఫికేషన్ ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిర చేయనున్నాయి. అరిగిపోయిన ఆరు గ్యారెంటీల గ్రామఫోన్ రికార్డు కూడా వారిని గట్టెక్కించేలా కనిపించడం లేదు. అసెంబ్లీలో పడే అవినీతి మచ్చతోనే స్థానిక సమరానికి వెళ్లాల్సిన పరిస్థితిని రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షానికి కల్పించనున్నారు.
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బయటి చలిని మరిపించే, వాడి వేడిగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రతిపక్షమే డిఫెన్స్ లో ఉంది. అధికార పక్షం అఫెన్స్ లో ఉంది. మిగతా పార్టీలు అసలు ఈ ఆట ఆడాలో తెలియని ఆయోమయంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంది.
కయ్యానికి మేం సైతం అంటున్నకమల దళం, ప్రధాన ప్రతిక్షం బీఆర్ఎస్ ల మధ్య కాంగ్రెస్ ఉన్నా, వేటికవే ఆ పార్టీలను కట్టడి చేయడానికి ప్రభుత్వం రెఢీ అయిందని తెలుస్తోంది. అందుకు అంశాల వారీగా, బీఆర్ఎస్ ను, బీజేపీని, అవసరమైతే ఎంఐఎంను కూడా అడ్డుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అటు భాజాపా, భారాసా మధ్యలో కాంగ్రెస్
ఎంఐఎం కూడా వారి స్థాయిలో వారు తమ మంత్రి వర్గాన్ని, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలలో తగిన సబ్జెక్ట్, వాగ్ధాటి ఉన్న వారిని గుర్తించి, వేర్వేరుగా తయారు చేసినట్లు తెలుస్తోంది. సభలో అధికార పార్టీని ఇరుకున పెట్టే అంశాలు వచ్చినప్పుడు వ్యవహరించే తీరుతోపాటు, ఎదురుదాడి చేసేందుకు తగిన తర్ఫీదు ఇచ్చినట్ల సమాచారం. ఈసారి ప్రతిపక్షాలను అష్ట దిగ్బంధనం చేసి, అన్ని విధాలుగా పై చేయి సాధించాలని పాకులాడుతున్నట్లుగా సమాచారం.
సీఎం సహా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్, సీతక్క, పొన్నం, లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మందుల సామెల్, వేముల వీరేశం, కడియం, దానం వంటి ఎమ్మెల్యేలు మండలిలో మరికొందరిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
దీనికి దీటుగా కాగ్ నివేదికలు, ఆరు గ్యారెంటీల అమలు, ప్రభుత్వంలో అవినీతి, యూరియా, వర్షాకాల వైపరీత్యం, రైతాంగ సమస్యలు వంటి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
ఇక మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ యథావిధిగా ఈసారి కూడా అసెంబ్లీకి హాజరయ్యేలా లేరు. దీంతో ఆ భారతమంతా కేటీఆర్, హరీశ్ రావులు, మధ్య మధ్య జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి వారిపై పడనుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగున్నాయి.
సర్కార్ లో వర్షాతిరేకాలు!
కాంగ్రెస్ కు కలిసొచ్చిన ‘కాలం’
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడో లేదో తెలియదు కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కాలం కలిసే వచ్చింది. తెలంగాణలో నిన్న మొన్నటి దాకా కురుస్తూనే ఉన్న భారీ వర్షాలు కాంగ్రెస్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే, సర్కార్ లో మాత్రం వర్షాతిరేకాలు వెల్లడవుతున్నాయి. కరువు నుంచి కరువు తీరా పడిన వానలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కలిసివచ్చిందనే చెప్పాలి. వర్షాల్లేక రైతుల ఆందోళన ప్రభావం నేరుగా ప్రభుత్వంపై పడింది. మరోవైపు అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర ఖజానా వెక్కిరిస్తోంది. అప్పులకు వడ్డీలు కట్టలేని దీన స్థితి దిక్కుమాలి ఉంది. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దైన్యం దర్జాగా తిష్టేసిం. రెగ్యులర్ పథకాలకు కూడా నిధుల కొరత తిక్కలేపుతోంది. యువ వికాసం లాంటి పథకాలను లాంచ్ చేయలేక లబోదిబోమంటున్నది సర్కార్.
ఈ సమయంలోనే వానలు లేక దిగాలు పడిన రైతులు నేరుగా సర్కార్ నే టార్గెట్ చేశారు. వర్షాల్లేవ్, రైతు బంధు వస్తదో రాదో? పంట నష్టాలు ఎలాగూ సర్కార్ ఇవ్వదు. వీటిని ఎవరు భరించాలె? సర్కార్ వైఫల్యాలను గుర్తు చేసుకుంటూ మరీ రైతులు తిట్టిపోశారు. ఇక ఇప్పుడు వద్దంటే వానలు కురిసి రైతులు పంటల పనుల్లో బిజీగా మారారు. ఎవరి పనుల్లో వారున్నారు. దీంతో రైతుల నుంచి, కాలం కావడంలేదన్న ఇతర అన్ని వర్గాల నుంచి సర్కార్ పై వ్యతిరేకత తగ్గిందనే చెప్పాలి. జనగామ జిల్లా లాంటి ఎత్తైన మెట్ట ప్రాంతాల్లో మాత్రం వర్షాలు సాధారణ స్థాయిలో కూడా కురవలేదు. పైగా, చెరువులు, కుంటలు నిండక, కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ వరకు ఇంకా వర్షాకాలం మిగిలే ఉన్నందున అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, నిన్న, మొన్నటి పరిస్థితుల కంటే ఓవర్ ఆల్ గా సర్కార్ పై వ్యతిరేకత చాలా వరకు తగ్గింది.

