మట్టి వినాయక విగ్రహాలే సముచితం
అడుగు డిజిటల్ మీడియా పంపిణీ ఉచితం
సహకరించిన వారి మిత్రులు అభినందనీయం
నియోజకవర్గ ప్రజలకు MLA|ఎమ్మెల్యే యశస్వినీ|YASHASWINI శుభాకాంక్షలు
పాలకుర్తి, ఆగస్టు 26 (అడుగు న్యూస్):
గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుతూ, అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వలన నీటి వనరులు కలుషితమవుతున్న పరిస్థితిని నివారించేందుకు మట్టి వినాయకులనే వినియోగించాలని ప్రజలకు అడుగు డిజిటల్ మీడియా పిలుపునిచ్చింది. పాలకుర్తి మండల కేంద్రంలో, శివసాయి కిరాణం & జనరల్ స్టోర్స్ అధినేత చారగొండ్ల రవి కుమార్ సహకారంతో అడుగు డిజిటల్ మీడియా, మార్గం ఫౌండేషన్ & స్టూడెంట్ ఫర్ సేవ ట్రస్ట్ సంయుక్తంగా రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆయా సంస్థల చైర్మెన్ మార్గం సాయి సందేశ్ తేజ సభ అధ్యక్షత వహించగా, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా, చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ విశిష్ట అతిథిగా హాజరై ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ తెలంగాణ, తన నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. రసాయనాలు లేని మట్టి వినాయక విగ్రహాలు నీటిలో కలిసిపోయేలా ఉంటాయి. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి ఈ సంప్రదాయం ఎంతో మేలుగా నిలుస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణ హితమైన ఆచారాలను అలవాటు చేయాలని సూచిస్తూ, భక్తి భావన ప్రకృతిని హానిచేయకూడదు. మట్టి వినాయకుల వినియోగం ద్వారా మన భక్తి ప్రకృతి మాతకు మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అడుగు డిజిటల్. మీడియా యాజమాన్యం గురించి ఎంత చెప్పిన తక్కువేనని అన్నారు. వారి సేవలు చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలకు అడుగు చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ కుటుంబం ముందుంటుందని చెప్పారు. ఇదే సందర్భంలో ఈ కార్యక్రమానికి సహకరించిన చారగొండ్ల రవి కుమార్ కుటుంబాన్ని కూడా అభినందించారు. అనంతరం అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, మట్టి వినాయకుల వినియోగం వల్ల కలిగే లాభాలను వివరించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకాలు నీటి వనరులకు కలిగించే నష్టాలను ప్రజలకు వివరించారు. మా బృందం ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ప్రజలు పర్యావరణ హిత ఆలోచనలు చేయాలని, మట్టి గణపతిని మహా గణపతిగా పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చారగొండ్ల రవి కుమార్ కుటుంబానికి, అన్ని తానై కార్యక్రమాన్ని రూపొందించి, విజయవంతం చేసిన అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దూలం పవన్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మారం రవి కుమార్, ఆర్యవైశ్య సంఘం మాజీ మండల అధ్యక్షుడు చీదర జగదీష్, సంగి వెంకన్న, రమేష్, బోనగిరి సాగర్, బోనగిరి కృష్ణమూర్తి, మణికంఠ సోమన్న, మార్గం సారంగపాణి, అనంతుల సోమేశ్వర్, వైట్ల శ్రీహరి, మార్కండేయ, పోగు రాములు, గోనె మహేందర్ రెడ్డి, దుంపల సంపత్, సతీష్, జంపాల రాజు, రాపాక అనిల్, పెద్దూరి సోమన్న, రాపాక ఉపేందర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


