మాట్లాడితే తప్పేంటి?
ముచ్చటిస్తే ముప్పేంటి?
PEACE|శాంతి చర్చలపై రాజ్యం కర్తపు టేరులు!
‘శత్రువు’పై కనికరం! ‘మాట’పై మారణ‘హోమం’!!
రాజ్యం తన పిల్లలను తానే చంపుకుంటుందా? తన సంతతిని తానే సర్వనాశనం చేసుకుంటోందా? తన భవిష్యత్తును తానే చిదిమేసుకుంటుందా? సమస్యలను వదిలేసి, ఆ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వాళ్ళని చంపేసి రాజ్యం సాధించేదేంటి? హింస. హింసకు ప్రతి హింస. ఆ ప్రతి హింసకు మరో హింస. ప్రాణాలు ఎవరికైనా ఒక్కటే! తుపాకీ పట్టడం రాజ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకం. నిజమే, కానీ వారు ఆ తుపాకీ పట్టడానికి కారణాలేంటి? కారకులెవరు? రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం, తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది? అందుకు కారణాలు వెతకకుండా, కారకులను అంతమొందిస్తే, ఆ ఉద్యమాలు, పోరాటాలు ఆగిపోతాయా? తాత్కాలికంగా ఆగిపోతే పోవచ్చు కానీ, మరో రూపంలో అవి మళ్ళీ తలెత్తవన్న గ్యారెంటీ ఏంటి? దోపిడీ, అణచివేత ఉన్నంత కాలం, పోరాటం, తిరుగుబాటు కచ్చితంగా కలుగుతుంది. చర్యకు ప్రతి చర్య అనేది సామాన్య సూత్రం. ప్రతి చర్యకు ప్రతిచర్య, ఆ ప్రతి చర్యకు మరో ప్రతిచర్య… ఇలా అంతులేని, అదుపులేని చర్యలు అశాంతికి, అభద్రతకు దారితీస్తాయి. మొత్తానికి విలువైన మానవ జీవితాలకే విలువ లేకుండా పోయింది.
2025, మార్చి 31 నాటికి దేశంలో కమ్యూనిస్టు తీవ్రవాదాన్ని పూర్తిగా అణచి వేయాలన్నది ఆపరేషన్ కగార్ లక్ష్యం. మావోయిస్టుల ఏరివేత అత్యంత ఉధ్రుతంగా సాగుతున్నది. అనేక మంది మావోయిస్టులు, వారికంటే అధికంగా గిరిజనులు హతమవుతున్నారు. అసలు మావోయిజం ఏంటి? ఈ నక్సలైట్లు ఎవరు?
నిజానికి నక్సలిజాన్ని, నక్సలైట్లను సమర్ధించడం కాదు కానీ, ఆ ఉద్యమ హింసను మినహాయిస్తే, వారి భయంతో గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థ ఆగిపోయింది. దొరల, భూస్వాముల గడీల ఆగడాలు అంతమొందాయి. రాజకీయ నేతల ఆరాచకాలు, అసాంఘిక శక్తులు అదుపులో ఉండేవి. తప్పు చేయడానికి జంకేవారు. అంతెందుకు పోలీసు వ్యవస్థ అంటే విలువ, గౌరవం, భయం, భక్తి ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
మొత్తంగా ఇప్పుడు మావోలను అంతమొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. శత్రు దేశం అడిగిందే తడవు యుద్ధాన్ని విరమించిన మన ప్రభుత్వం, ‘మన బిడ్డలే’ అడిగినా వినకుండా వారిపై యుద్ధాన్ని చేస్తూ మట్టుపెట్టడం ఏ మానవీయతకు, మరే మారణహోమానికి సంకేతం? అయితే దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. రాజకీయ దోపిడీ ఉంటే తిరుగుబాటు తప్పదని చరిత్ర రుజువు చేసింది. ప్రభుత్వం మావోయిస్టులను అంతమొందించడం సులువే కావచ్చు. కానీ, ప్రజల్లో గూడుకట్టుకున్న ఆందోళనలను అణచివేయడం మాత్రం అసాధ్యమని గుర్తించాలి.
‘శత్రువు’పై కనికరం! ‘మాట’పై మారణ‘హోమం’!!
రాజ్యం తన పిల్లలను తానే చంపుకుంటుందా? తన సంతతిని తానే సర్వనాశనం చేసుకుంటోందా? తన భవిష్యత్తును తానే చిదిమేసుకుంటుందా? సమస్యలను వదిలేసి, ఆ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వాళ్ళని చంపేసి రాజ్యం సాధించేదేంటి? హింస. హింసకు ప్రతి హింస. ఆ ప్రతి హింసకు మరో హింస. ప్రాణాలు ఎవరికైనా ఒక్కటే! తుపాకీ పట్టడం రాజ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకం. నిజమే, కానీ వారు ఆ తుపాకీ పట్టడానికి కారణాలేంటి? కారకులెవరు? రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం, తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది? అందుకు కారణాలు వెతకకుండా, కారకులను అంతమొందిస్తే, ఆ ఉద్యమాలు, పోరాటాలు ఆగిపోతాయా? తాత్కాలికంగా ఆగిపోతే పోవచ్చు కానీ, మరో రూపంలో అవి మళ్ళీ తలెత్తవన్న గ్యారెంటీ ఏంటి? దోపిడీ, అణచివేత ఉన్నంత కాలం, పోరాటం, తిరుగుబాటు కచ్చితంగా కలుగుతుంది. చర్యకు ప్రతి చర్య అనేది సామాన్య సూత్రం. ప్రతి చర్యకు ప్రతిచర్య, ఆ ప్రతి చర్యకు మరో ప్రతిచర్య… ఇలా అంతులేని, అదుపులేని చర్యలు అశాంతికి, అభద్రతకు దారితీస్తాయి. మొత్తానికి విలువైన మానవ జీవితాలకే విలువ లేకుండా పోయింది.
2025, మార్చి 31 నాటికి దేశంలో కమ్యూనిస్టు తీవ్రవాదాన్ని పూర్తిగా అణచి వేయాలన్నది ఆపరేషన్ కగార్ లక్ష్యం. మావోయిస్టుల ఏరివేత అత్యంత ఉధ్రుతంగా సాగుతున్నది. అనేక మంది మావోయిస్టులు, వారికంటే అధికంగా గిరిజనులు హతమవుతున్నారు. అసలు మావోయిజం ఏంటి? ఈ నక్సలైట్లు ఎవరు? 1967లో పశ్చిమ బెంగాల్ లోని నక్సల్బరీ అనే గ్రామంలో భూస్వాములపై రైతు కూలీల తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు చేసిన వారిని నక్సలైట్ అన్నారు. చైనా తరహాలో దేశంలో దీర్ఘకాలిక ప్రజా యుద్ధాన్ని ఆకాంక్షిస్తూ చారుమజుందార్ రాసిన 8 పత్రాలే నక్సల్స్ ఉద్యమానికి పునాది. చారు మజుందార్, కను సన్యాల్, జంగల్ సంతల్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఒక వర్గంగా ఏర్పడింది. ఆ తిరుగుబాటు ఏప్రిల్ 1969లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ఏర్పాటుకు దారితీసింది. ఇది ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలలో ఇలాంటి ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. 1972 జులైలో చారు మజుందార్ పోలీసు కస్టడీలో మరణం తర్వాత నక్సలిజం దాదాపు అంతమైంది. 1970 చివరలో నక్సలిజం మళ్ళీ చిగురించింది. 1980 నాటికి దేశంలో 30 నక్సలైట్ గ్రూపులు, 30వేల మంది సభ్యులతో ఉన్నాయని అంచనా. 1980లో కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తితో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ ని స్థాపించారు. ఇది మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాతో విలీనం అయి 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)గా ఏర్పాటైంది. నక్సలైట్ ఉద్యమం మొదలైన నాటి లాగే, ఆ తర్వాత కాలంలోనూ విద్యార్థులే ఈ ఉద్యమానికి ఆకర్షితులైయ్యారు. ఆ తర్వాత మారిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, అణచివేత, ఆలోచనల పరిణామాల్లో రిక్రూట్ మెంట్ కూడా తగ్గి, ఉద్యమం అడవులకు, గిరిజనులకే పరిమితమైంది. అయితే, అక్టోబర్ 11, 2004న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో 11 మంది మావోయిస్టుల బృందంతో 4 రోజుల పాటు చర్చలు జరిగాయి. అదే తరహా చర్చలకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద అఖిల పక్షాలు మహాధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, అథమం గిరిజన సంఘాలతోనైనా చర్చలు జరపాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సినీ నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహా ధర్నా ముగిసిన కొద్ది గంటల్లోనే జరిగిన మరో భారీ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు ముగ్గురు హతమయ్యారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందాడు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో ప్రతినిధిగా ఉన్నారు. ఈ సమయంలోనూ ఇక చర్చలకు తావు లేదన్న విధంగా కేంద్రం మొండిగా ఉంది. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత, మణిపూర్ అల్లర్లు అణచివేయడంలో లేని దూకుడును మావోల అంతానికి కేంద్రం ప్రదర్శిస్తోంది.
నిజానికి నక్సలిజాన్ని, నక్సలైట్లను సమర్ధించడం కాదు కానీ, ఆ ఉద్యమ హింసను మినహాయిస్తే, వారి భయంతో గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థ ఆగిపోయింది. దొరల, భూస్వాముల గడీల ఆగడాలు అంతమొందాయి. రాజకీయ నేతల ఆరాచకాలు, అసాంఘిక శక్తులు అదుపులో ఉండేవి. తప్పు చేయడానికి జంకేవారు. అంతెందుకు పోలీసు వ్యవస్థ అంటే విలువ, గౌరవం, భయం, భక్తి ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఆపరేషన్ కగార్ ను కార్పొరేట్ కబ్జాగా, మానవత్వానికి మాయని మచ్చగా మేధావులు అభివర్ణిస్తున్నారు. జల్, జంగిల్, జీమీన్ నినాదానికి పరిష్కారం ఏది? మావోలతో చర్చలు జరపాలన్న వాళ్ళని అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేస్తున్నారు. మావోయిస్టులు మైకులు ఎందుకు పట్టుకుంటారు? అని అసహనం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధంగా ఉన్నా చంపడమేంటని ప్రశ్నించారు. అడవుల్లోని ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే అమిత్ షా నక్సలైట్ రహిత దేశంగా చేస్తామంటున్నారని కూడా విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ తో చర్చలు జరిపిన కేంద్రం.. భరత మాత ముద్దు బిడ్డలైన మావోలతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. అన్యాయాన్ని అడిగిన వాడు నక్సలైట్.. అడగని వాడు ఆల్ రైట్ అనే ఉద్దేశంతో కేంద్రం వ్యవహరిస్తుందని విమర్శించారు.
మొత్తంగా ఇప్పుడు మావోలను అంతమొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అయితే దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. రాజకీయ దోపిడీ ఉంటే తిరుగుబాటు తప్పదని చరిత్ర రుజువు చేసింది. ప్రభుత్వం మావోయిస్టులను అంతమొందించడం సులువే కావచ్చు. కానీ, ప్రజల్లో గూడుకట్టుకున్న ఆందోళనలను అణచివేయడం మాత్రం సాధ్యం కాదని గుర్తించాలి.
-డా. మార్గం లక్ష్మీనారాయణ