|Jammu Kashmir|Ind vs Pak|India|Pakistan|
జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భద్రతా బలగాలు మరోసారి ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతోంది. నాదర్, ట్రాల్, అవంతిపుర ప్రాంతాల్లో ఉదయం ప్రారంభమైన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అక్కడి పరిసర ప్రాంతాల్లో నిఘా మరింత కట్టుదిట్టం చేశారు.
ఉగ్రవాదులు ముగ్గురు హతం |Terrorist|Encounter|

