ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మరియు ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, భాజపా అభ్యర్థిగా పర్వేష్ సాహిబ్‌సింగ్ వర్మ నిలిచారు. ఎన్నికల ముందు భాజపా సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటికీ, జాట్ సామాజిక వర్గానికి చెందిన వర్మను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ప్రచారంతో జాట్ వర్గ ఓట్లు భారీగా భాజపా వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ఫలితాల్లో పర్వేష్ వర్మ కేజ్రీవాల్‌పై ఆధిక్యత కనబరుస్తుండటంతో, ఆయన గెలిస్తే భాజపా అధికారంలోకి వచ్చినట్లయితే సీఎం పదవికి ఆయన పేరు పరిశీలించే అవకాశం ఉంది. అయితే, భాజపా అధికారికంగా ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.

