పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్షాల మధ్య నిరసనలు ఉధృతమయ్యాయి. ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని పట్టుబడుతూ ఆందోళన చేశారు. బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపిస్తూ ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నిరసనల సమయంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఎంపీలు పార్లమెంట్ భవనం మెట్లపైకి ఎక్కి నిరసనలు చేపట్టగా, తోపులాటలో బీజేపీ ఎంపీ సారంగికి గాయమైంది. దీనితో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

