ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే, పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. రాంగోపాల్ పెట్ పోలీసులు అల్లు అర్జున్‌కు ముందుగా ఆస్పత్రికి వెళ్లే సమయం తెలియజేయాలని కోరారు. బన్ని ఈ సమాచారం ఇవ్వడంతో, పోలీసులు ఆయన్ని షరతులు పాటించేలా సూచించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్‌లో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి, ముందుగా పోలీసులకు సమాచారం అందించాలి అని నోటీసుల్లో పేర్కొన్నారు.

