కొన్ని రోజులుగా ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ విడాకుల గాసిప్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి నిమ్రిత్ కౌర్‌తో అభిషేక్ ఎఫైర్ కారణంగా వీరు విడిపోతున్నారు అనే వార్తలు జోరుగా వినిపించాయి. పైగా, కుమార్తె ఆరాధ్య బర్త్‌డే వేడుకలకు అభిషేక్ హాజరుకాకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ఈ గాసిప్స్‌పై ఐశ్వర్య గానీ, అభిషేక్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వెళ్లి వచ్చిన బచ్చన్ ఫ్యామిలీ ముంబై చేరుకుంది. ఈ సందర్భంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య ముగ్గురు కలిసి కనిపించారు. నవ్వుతూ రిలాక్స్‌గా ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యను కారు లోపలికి రావడానికి డోర్ తెరిచి మరీ పట్టుకోవడం అభిమానులకు హ్యాపీ మూమెంట్‌గా మారింది. అభిషేక్ గ్రే హుడీ, నలుపు ప్యాంట్‌లో, ఐశ్వర్య నలుపు స్వెట్‌షర్ట్, జెగ్గింగ్‌లో, ఆరాధ్య నీలిరంగు డ్రస్‌లో మెరిసారు.
ఈ ఫోటోలు వెలుగులోకి రావడంతో ‘‘విడిపోతున్నారు’’ అనే వార్తలకు చెక్ పడింది. అభిమానులు ఈ ఫోటోలపై హర్షం వ్యక్తం చేస్తూ, వారి ఫ్యామిలీ బాండ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

