గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించగా, దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రానికి అనిత సమర్పకురాలు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసి, సినిమాపై అంచనాలు పెంచారు.https://youtu.be/zHiKFSBO_JE?si=fJe7riAiBVZR_Qa4

