విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రం సంక్రాంతి బరిలో రిలీజ్‌కి రాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్ వెరైటీ గా నిర్వహిస్తున్నారు. ‘డాకు మహారాజ్’, ‘గేమ్ చేంజర్’ వంటి భారీ చిత్రాలకు పోటీగా ఉన్నా, ఈ సినిమా ప్రమోషన్లు పీక్‌లో ఉన్నాయి. అనిల్ రావిపూడి తనకంటూ ప్రత్యేకమైన కామెడీ ప్రమోషన్స్‌తో ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. తాజాగా, సినిమా టీమ్‌తో ఆయన చేసిన హిలేరియస్ వీడియో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

