లండన్ మధ్య నుంచి ప్రవహించే థేమ్స్ నదిలా. ఢిల్లీ మధ్యలోంచి ప్రవహించే యమునానది, హైదరాబాద్ మధ్య నుంచి ప్రవహించే మూసీ నదిని ఒక్కసారి పోల్చి చూస్తే, పై రెండు నదులు ఆ నగరాలకు పర్యాటక కళను తెచ్చాయి. కానీ, కాలక్రమేణా మూసీ నదిని మనం, హైదరాబాద్ కు పెద్ద మోరీగా, మురికి, నరక కూపంగా మార్చేశాం. మూసీ పరివాహకాన్ని ఆక్రమణలతో, చెత్తాచెదారంతో ముంచెత్తాం. విస్తరించిన హైదరాబాద్ మురికినంతా మూసీలోంచే పోనిస్తున్నాం. అందుకే అది ఇప్పుడు మనల్ని ముంచేస్తోంది.
అసలు అంతకుముందు 311 ఏళ్ళకు ముందే, కులీ కుతుబ్ షాహీల కాలంలోనే గోల్కొండ కోటలో వదదలు ముంచెత్తి ప్లేగు వ్యాప్తిచెంది, గత్తర లేసింది. ఆ గత్తర ఉపశమన. హైదరాబాద్ నిర్మాణ శంకుస్థాపన గుర్తే నేటి చార్మినార్. హైదరాబాద్ నిర్మాణానికి ముందు, తర్వాత కూడా వరద ముంపు ముప్పు పొంచి ఉంటూనే ఉంది.
ఇప్పుడు అంతకుమించి వర్షం పడింది. గతేడాది వరదల కారణంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ ప్రజలు ఎంతగా నష్టపోయారో చూశాం. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ఈ వరదలు అందరికళ్ళూ తెరిపించాలి. మూసీ ప్రక్షాళనే ముందున్న కర్తవ్యం! ‘డా.మార్గం-అడుగు’ ఎడిటోరియల్
అది 1908 సెప్టెంబర్ 28. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసి, మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఆనాడు 46 అడుగుల ఎత్తుకు అలలు ఎగసిపడి, హైదరాబాద్ నగరం మొత్తం మునిగిపోయింది. ఈ ప్రభావంతో హైదరాబాద్‌ను పునర్నిర్మించవలసి వచ్చింది. ఈ వరదల ఉద్ధృతి పర్యవసానమే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నిర్మాణం. కట్ చేస్తే, ఇది 2025 సెప్టెంబర్ 27. భారీ వర్షాలతో పాటు, వెల్లువెత్తిన వరద నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుండి విడుదల చేయడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఎంజీబీఎస్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. సహాయక చర్యలు చేపట్టారు, డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్నారు. మూసీ నది ఉప్పొంగినప్పుడు. నగరం తన సహజ నీటి పారుదల వ్యవస్థను కోల్పోవడం వల్ల, ఇలాంటి వరదలకు గురయ్యే అవకాశం పెరుగుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. అసలు అంతకుముందు 311 ఏళ్ళకు ముందే, కులీ కుతుబ్ షాహీల కాలంలోనే గోల్కొండ కోటలో వదదలు ముంచెత్తి ప్లేగు వ్యాప్తిచెంది, గత్తర లేసింది. ఆ గత్తర ఉపశమన. హైదరాబాద్ నిర్మాణ శంకుస్థాపన గుర్తే నేటి చార్మినార్. హైదరాబాద్ నిర్మాణానికి ముందు, తర్వాత కూడా వరద ముంపు ముప్పు పొంచి ఉంటూనే ఉంది.
భారీ వర్షాల కారణంగా మూసీ ఉప్పొంగింది. కాలనీలు నీట మునిగాయి. ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి భారీగా వరద చేరింది. బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. శుక్రవారం కురిసిన వర్షానికి ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనలపై నుంచి మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
లండన్ మధ్య నుంచి ప్రవహించే థేమ్స్ నదిలా. ఢిల్లీ మధ్యలోంచి ప్రవహించే యమునానది, హైదరాబాద్ మధ్య నుంచి ప్రవహించే మూసీ నదిని ఒక్కసారి పోల్చి చూస్తే, పై రెండు నదులు ఆ నగరాలకు పర్యాటక కళను తెచ్చాయి. కానీ, కాలక్రమేణా మూసీ నదిని మనం, హైదరాబాద్ కు పెద్ద మోరీగా, మురికి, నరక కూపంగా మార్చేశాం. మూసీ పరివాహకాన్ని ఆక్రమణలతో, చెత్తాచెదారంతో ముంచెత్తాం. విస్తరించిన హైదరాబాద్ మురికినంతా మూసీలోంచే పోనిస్తున్నాం. అందుకే అది ఇప్పుడు మనల్ని ముంచేస్తోంది.
మూసీ నది ఒడ్డునే 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ ని స్థాపించాడు. శత్రు దుర్బేధ్యమైన గోల్కొండ కోటను రాజధానిగా చేశాడు. అతను ప్రేమలో పడిన, ఇప్పటి చిన్న శ్రీశైలానికి చెందిన భాగమతి అనే స్థానిక నాట్యకారిణి పేరు మీద నగరానికి మొదట భాగ్యనగరం అని పేరు పెట్టాడని ప్రతీతి. తర్వాత ఆమె ఇస్లాం స్వీకరించి హైదర్ మహల్ బిరుదు పొందిన తర్వాత నగరానికి “హైదరాబాద్” అని పేరు మార్చినట్లు చెబుతారు.
ఇప్పటి వర్షాలు, వరదలు, నష్టకష్టాలకతీతంగా ఒకసారి మూసీని పరిశీలిస్తే, మూసీ ప్రక్షాళన జరిగింది. ప్రస్తుతం కనిపిస్తున్న విధంగా నిరంతరాయంగా మూసీ నిండుగా స్వచ్ఛంగా ప్రవహిస్తే హైదరాబాద్‌కు కళ వస్తుంది. తాగునీటి కష్టాలు పోతాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. నగరం మధ్యలో నది ప్రవాహం జీవకళను కళ్ళకు కడుతోంది. గత కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వానల కారణంగా మూసీ ఉప్పొంగుతోంది. మూసీ నదీ దారిని దారుణంగా ధ్వంసం చేశాం. మూసీ సహా, చెరువులు, నాలాలు, రోడ్లు, అన్నింటి పైనా దురాక్రమణల దాడులు చేశాం. సరిగ్గా ఈ తరుణంలోనే హైడ్రా, మూసీ ప్రక్షాళన ఎందుకన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందేమో! బుద్ధి జీవులు ఆలోచించాలి. హైడ్రా అమాయకుల ఆక్రమణలను మాత్రమే కూల్చేసిందన్న ఆరోపణలను పక్కనపెడితే, కొంతలో కొంతైనా బతుకమ్మ కుంట సాక్షిగా, దాని పనితనం ప్రభావం మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. మరోవైపు మూసీ ప్రక్షాళన అవసరాన్ని నొక్కి చెబుతోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణ, మనుషుల మలినాల నియంత్రణ, చెత్తా చెదారం వేయకుండా అందరిలో రావాల్సిన స్వీయ క్రమశిక్షణ, నది పరిరక్షణకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. నాలాలపై ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయాల్సి ఉంది.
హైడ్రాను హైడ్రామాగా, అది ఎంత దూకుడు ప్రదర్శిస్తే ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత వస్తుందన్న భావనలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఉన్నాయి. అందుకే పేదలను ముందుకు తెస్తున్నాయి. ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని కూడా కోరుకుంటున్నాయి. మొత్తంగా ఎవరికి వారు రాజకీయ కోణంలో తమకు లాభమా? కాదా? అన్న ధోరణిలోనే మాట్లాడుతున్నారు.
నిజానికి హైదరాబాద్‌లో శతాబ్దాలు ఆక్రమణలు జరిగాయి. దశాబ్దాలుగా మూసీ ఆక్రమణలు జరిగాయి. ఓ సజీవ నది కాస్తా.. చిన్న మురికి కాలువగా మారిపోయింది. ఇప్పుడు అది ఎలా ఉండేదో తాజా వరదలతో స్పష్టంగా తెలుస్తోంది. మూసీ ప్రవాహంతో అందులో ఉన్న వారు బయటకు రాక తప్పలేదు. కూల్చివేతలపై ఎంత నెగెటివ్ ప్రచారం జరిగినా, సీఎం రేవంత్ రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
నిజంగా మూసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి.. అనుకున్న విధంగా ప్రాజెక్టును పట్టాలెక్కిస్తే.. రివర్ సిటీగా హైదరాబాద్ మారిపోతుంది. బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. చెరువులు, నాలాల ఆక్రమణలు లేకపోతే.. ఎంత వర్షం పడినా ముంపు ఉండదు. ఐదేళ్ల కిందట హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసింది. పదుల సంఖ్యలో జనం కొట్టుకుపోయారు. హైదరాబాద్‌లోని సగం ఇళ్లు నీట మునిగాయి. అంత వరద వందేళ్లలో రాలేదని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అంతకుమించి వర్షం పడింది. గతేడాది వరదల కారణంగా ఖమ్మం, విజయవాడ ప్రజలు ఎంతగా నష్టపోయారో చూశాం. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా చూసుకోవాలి. ఈ వరదలు అందరికళ్ళూ తెరిపించాలి.

