ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిఐడీ కేసులను సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బాలయ్య వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పిటిషన్ తప్పుల తడక అని ధర్మాసనం పేర్కొనడంతో పాటు, దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను చట్టబద్దంగా వాదించకపోతే, దానికి సంబంధించి ఒక్క మాట కూడా చెప్పిన వారికి భారీ జరిమానా విధించనున్నట్లు జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు.

